DNews:27 Jan: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. రాష్ట్రంలోని 7 నగరపాలక సంస్థలు (Corporations), 116 పురపాలక సంఘాల (Municipalities) ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని నేడు జనవరి 27, 2026 అధికారిక షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఈ ప్రకటన వెలువడిన తక్షణమే రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. మొత్తం 52.43 లక్షల మంది ఓటర్లు ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

ఈ నెల 28వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. నామినేషన్లు దాఖలు చేయడానికి ఈ నెల 30వ తేదీ సాయంత్రం వరకు గడువు ఇచ్చారు. జనవరి 31న నామినేషన్ల స్క్రూటినీ నిర్వహిస్తారు. ఫిబ్రవరి 1వ తేదీన తిరస్కరణకు గురైన నామినేషన్లపై అప్పీళ్లను స్వీకరిస్తారు. ఫిబ్రవరి 3వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. అదే రోజు సాయంత్రం పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు.

రాష్ట్రవ్యాప్తంగా ఫిబ్రవరి 11వ తేదీన ఒకే విడతలో పోలింగ్ నిర్వహించనున్నారు. అనంతరం ఫిబ్రవరి 13వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడిస్తారు. ఈ ఎన్నికల కోసం రాష్ట్రవ్యాప్తంగా 7 కార్పొరేషన్లలో 414 వార్డులు, 116 మున్సిపాలిటీల్లో 2,582 వార్డులకు పోలింగ్ జరగనుంది. మార్చి 15వ తేదీ లోపు మొత్తం ఎన్నికల ప్రక్రియను ముగించాలని ఎన్నికల సంఘం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఎన్నికలను ప్రధాన రాజకీయ పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.

By rajesh

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana