
లోకేశ్ కనగరాజ్ కథానాయకుడిగా, అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ చిత్రం ‘డీసీ’ ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వైవిధ్యమైన కథనం, రస్టిక్ టేకింగ్, అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలతో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. విడుదలైన కొద్దిరోజుల్లోనే మంచి వసూళ్లు సాధిస్తూ తనదైన ముద్ర వేసుకుంది.
హీరోగా లోకేశ్ కనగరాజ్ ఇచ్చిన పర్ఫార్మెన్స్, అరుణ్ మాథేశ్వరన్ విభిన్నమైన మేకింగ్, అనిరుధ్ రవిచందర్ సంగీతం సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. రొటీన్ యాక్షన్ కథలకు భిన్నంగా తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.
తాజాగా ఈ సినిమాపై టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ‘డీసీ’పై తన అభిప్రాయాన్ని పంచుకున్న ఆయన.. ఈ చిత్రాన్ని ఒరిజినల్, అద్భుతమైన సినిమాగా అభివర్ణించారు. సినిమా చాలా కూల్‌గా అనిపించిందని, ప్రతి సన్నివేశాన్ని ఎంతో ఆస్వాదించానని పేర్కొంటూ చిత్రబృందానికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
మహేశ్ బాబు చేసిన ఈ ప్రశంసలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఓ స్టార్ హీరో నుంచి వచ్చిన ఈ ప్రశంస ‘డీసీ’ చిత్రబృందానికి మరింత ఉత్సాహాన్ని ఇచ్చాయి. మహేశ్ బాబు ట్వీట్‌కు స్పందించిన మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్.. “మీ ట్వీట్‌కు ధన్యవాదాలు సార్” అంటూ కృతజ్ఞతలు తెలిపారు.
మహేశ్ బాబు ప్రశంసలతో ‘డీసీ’ సినిమాపై ప్రేక్షకుల్లోనూ మరింత ఆసక్తి పెరుగుతోంది.
