DET:SEP17:

నాని ‘ది ప్యారడైజ్’ – 30 ఎకరాల్లో విస్తరించిన భారీ స్లమ్ సెట్..‘స్లమ్స్ బాహుబలి’గా గుర్తింపు:
టాలీవుడ్ నటుడు నాని ప్రస్తుతం నటిస్తున్న సినిమా “ది ప్యారడైజ్” చుట్టూ భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన అప్‌డేట్ ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

సినిమా కథానుసారం,ప్రత్యేకమైన స్లమ్ వాతావరణం అవసరమని భావించిన టీమ్,ఏకంగా 30 ఎకరాల విస్తీర్ణంలో ఒక భారీ సెట్ నిర్మించింది.ఇది సాధారణ స్లమ్ సెటప్ కాదని,ప్రొడక్షన్ వ్యాల్యూస్ పరంగా చూడగానే హాలీవుడ్ స్థాయిలో అనిపించేలా రూపొందించారని యూనిట్ సభ్యులు చెబుతున్నారు.అందుకే దీనిని సినీప్రియులు “స్లమ్స్ బాహుబలి”అని పిలుస్తున్నారు.

నాని ఎంచుకునే కథలు ఎప్పుడూ విభిన్నంగా ఉండటమే కాకుండా, ఆయన నటనకు తగ్గట్టే సెటప్‌లు, ప్రొడక్షన్ డిజైన్స్ కూడా ప్రత్యేకతను సంతరించుకుంటాయి. “ది ప్యారడైజ్” కూడా అదే రేంజ్‌లో రూపొందుతున్న ప్రాజెక్ట్‌గా చెప్పబడుతోంది.

దర్శకుడు,ప్రొడక్షన్ హౌస్‌లు ఈ సెట్ నిర్మాణం కోసం విపరీతమైన ఖర్చు పెట్టారని,దీనివల్ల సినిమాకి ప్రత్యేకమైన రియలిస్టిక్ టచ్ వచ్చిందని సమాచారం.ఇప్పటికే బయటకు వచ్చిన అప్‌డేట్స్ సినిమాపై మరింత హైప్ పెంచుతున్నాయి.

నాని అభిమానులు మాత్రం ఈ చిత్రాన్ని “నేచురల్ స్టార్” కెరీర్‌లో మరో కొత్త దశగా భావిస్తున్నారు.పెద్ద స్లమ్ సెట్, విభిన్న కాన్సెప్ట్,నాని నటన – ఇవన్నీ కలసి సినిమా విజయానికి బలమైన హామీ ఇస్తాయని సినీ విశ్లేషకులు అంటున్నారు.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana