‘కేజీఎఫ్’ ఫ్రాంచైజ్‌తో పాన్ ఇండియా స్థాయిలో స్టార్‌డమ్ సొంతం చేసుకున్న రాకింగ్ స్టార్ యశ్ నటించిన తాజా చిత్రం ‘టాక్సిక్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే గత నెల 26న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన అందుకోలేకపోయింది. కథ, కథనం, దర్శకత్వంపై ప్రతికూల స్పందన రావడంతో బాక్సాఫీస్ వద్ద కూడా సినిమా నష్టాలను చవిచూసినట్లు ట్రేడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

ఇదిలా ఉంటే.. ఇప్పుడు ‘టాక్సిక్’ డిజిటల్ రైట్స్ విషయంలో మరో షాక్ ఎదురైనట్లు వార్తలు వస్తున్నాయి. సినిమా విడుదలకు ముందు ఓటీటీ హక్కుల కోసం ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ నుంచి భారీ ఆఫర్లు వచ్చినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. ఏకంగా రూ.150 కోట్లకు పైగా డీల్స్ వచ్చినప్పటికీ.. మేకర్స్ మరింత భారీ మొత్తాన్ని ఆశించడంతో ఆ సమయంలో ఎలాంటి ఒప్పందం కుదరలేదని సమాచారం.

అయితే థియేటర్లలో సినిమాకు వచ్చిన స్పందన అంచనాలను తారుమారు చేసింది. డిజిటల్ మార్కెట్‌లో కూడా సినిమాపై ఆసక్తి తగ్గినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఫిలిం నగర్ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం జీ స్టూడియోస్ మాత్రమే ‘టాక్సిక్’ డిజిటల్ హక్కులను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు టాక్.

అయితే ఆ సంస్థ నుంచి వచ్చిన ఆఫర్ కేవలం రూ.30 కోట్లకు పరిమితమైనట్లు ప్రచారం జరుగుతోంది. విడుదలకు ముందు రూ.150 కోట్లకు పైగా ఆఫర్లు వచ్చాయని వార్తలు రావడం, ఇప్పుడు మాత్రం రూ.30 కోట్ల స్థాయికి డిజిటల్ హక్కుల ధర పడిపోయిందనే ప్రచారం రావడం ట్రేడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

అయితే ఈ డిజిటల్ డీల్‌కు సంబంధించి చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఒకవేళ ఈ వార్త నిజమే అయితే.. భారీ అంచనాలతో తెరకెక్కిన ‘టాక్సిక్’కు థియేట్రికల్ ఫలితాలతో పాటు డిజిటల్ మార్కెట్‌లోనూ గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టే అవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana