
DNews:NOV 12:కొల్లాపూర్, మానవత్వం ఇంకా బ్రతికే ఉందని చాటిచెప్పిన ఘనతను కొల్లాపూర్ వైద్యులు సాధించారు. ఆర్థిక ఇబ్బందులతో చికిత్స పొందలేక సతమతమవుతున్న వృద్ధురాలికి స్థానిక వైద్యులు తమ వంతు సహాయం అందించి మనసులను గెలుచుకున్నారు.
పట్టణానికి చెందిన వృద్ధురాలు కాలుకు తీవ్రమైన ఇన్ఫెక్షన్ (Leg Infection) సోకడంతో నడవలేని స్థితికి చేరుకుంది. ఆర్థిక పరిస్థితులు బలహీనంగా ఉండడంతో వైద్యం పొందలేక ఇబ్బంది పడుతోంది. ఈ పరిస్థితిలో కుటుంబ సభ్యులు స్థానిక మమత హాస్పిటల్ వైద్యులు డాక్టర్ రెడ్డి దిలీప్‌కుమార్, డాక్టర్ ఉషారాణిలను సంప్రదించారు.
వృద్ధురాలిని పరిశీలించిన వైద్యులు మానవతా దృక్పథంతో స్పందించి, అతి తక్కువ ఫీజుతో శస్త్రచికిత్స చేశారు. ఇన్ఫెక్షన్ తీవ్రంగా వ్యాపించిన కాలును తొలగించే ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించారు.ఈ సందర్భంగా వైద్యులు తెలిపారు – “చిన్న గాయాలు, ఇన్ఫెక్షన్లు ప్రారంభ దశలోనే చికిత్స చేయించుకుంటే పెద్ద ప్రమాదాలు తప్పుతాయి. నిర్లక్ష్యం ప్రాణాంతకమవుతుంది” అని సూచించారు.
