D NEWS: వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి అవసరమైన నిధులు ఖర్చు చేయకపోవడం వల్లే ప్రస్తుత పరిస్థితి ఏర్పడిందని ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. త్వరలో ప్రారంభం కానున్న సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిపై దృష్టి పెట్టడంతో ఎంజీఎంకు అవసరమైన నిధుల వినియోగం జరగలేదని పేర్కొన్నారు.

ఎంజీఎం భవనాలు శిథిలావస్థకు చేరడం, పెచ్చులు ఊడిపడటం, రోగులకు అవసరమైన సౌకర్యాలు లేకపోవడంపై నాయిని మాట్లాడారు. ఆస్పత్రికి అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు నిధులు సక్రమంగా వినియోగించాల్సి ఉందని అన్నారు.

వచ్చే నెలలో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు నాయిని తెలిపారు. కొత్త ఆస్పత్రికి అవసరమైన వైద్య పరికరాలు, ఇతర సదుపాయాలను సమకూర్చుతున్నామని చెప్పారు.

ఎంజీఎంలో కొందరు వైద్యులు విధులకు సరిగా హాజరు కావడం లేదని నాయిని ఆరోపించారు. గతంలో తన తనిఖీల సమయంలో కొంతమంది వైద్యులు ఆస్పత్రికి రాకుండా ప్రైవేట్‌ క్లినిక్‌లలో సమయం గడుపుతున్నట్లు గుర్తించామని పేర్కొన్నారు.

కొత్త సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థ ఏర్పాటు చేయాలని నాయిని సూచించారు. ఆస్పత్రి నిర్వహణ, వైద్యుల హాజరు, రోగులకు అందుతున్న సేవలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారిగా ఐఏఎస్‌ అధికారిని నియమించాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana