
D News: Sept 22: ఆర్ఆర్బీ ఉద్యోగాలకు దరఖాస్తు గడువు పొడిగింపు
ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (ఐబీపీఎస్) రీజినల్ రూరల్ బ్యాంకుల్లో (ఆర్ఆర్బీ) 13,706 పోస్టుల భర్తీకి విడుదల చేసిన నోటిఫికేషన్‌కు దరఖాస్తు గడువును పొడిగించింది. సెప్టెంబరు 21తో ముగియాల్సిన దరఖాస్తు గడువును సెప్టెంబరు 27 వరకు పొడిగించినట్లు ఐబీపీఎస్ తెలిపింది.
ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రూప్-ఏ ఆఫీసర్లు (స్కేల్-I, II, III), గ్రూప్-బి ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీ పర్పస్) పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ, ఎంబీఏ, సీఏ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు.
అభ్యర్థుల ఎంపిక ఆన్లైన్ పరీక్షల ద్వారా జరుగుతుంది. ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షలతో పాటు అవసరమైన పోస్టులకు ఇంటర్వ్యూను నిర్వహించి తుది ఎంపిక చేపడతారు. వివిధ దశల్లో ఎంపిక ప్రక్రియ పూర్తయిన అనంతరం దేశవ్యాప్తంగా ఉన్న రీజినల్ రూరల్ బ్యాంకుల్లో అభ్యర్థులకు ఉద్యోగాలు కేటాయిస్తారు.
