
DNews: 17 Sep: ఆపరేషన్ సింధూర్‌లో మసూద్ అజ్హర్ కుటుంబం ముక్కలైంది: జైష్ కమాండర్ సంచలన అంగీకారం
తెలంగాణ పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor)లో జైష్-ఎ-మొహమ్మద్ (JeM) చీఫ్ మసూద్ అజ్హర్ కుటుంబం తీవ్ర దెబ్బతిన్నట్లు ఆ సంస్థ తాజాగా అంగీకరించింది. మే 7, 2025న జరిగిన ఈ దాడుల్లో అజ్హర్ కుటుంబ సభ్యులు 10 మంది, అతని సన్నిహితులు 4 మంది మరణించారు. ఈ విషయాన్ని JeM అగ్ర కమాండర్ మసూద్ ఇల్యాస్ కశ్మీరీ ఒక వైరల్ వీడియోలో వెల్లడించారు. ఇది పాకిస్తాన్‌లోని బహవల్పూర్‌లోని JeM హెడ్‌క్వార్టర్స్‌పై జరిగిన దాడిలో జరిగింది.
ఆపరేషన్ సింధూర్ వివరాలు:
నేపథ్యం: ఏప్రిల్ 22, 2025న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాం ప్రాంతంలో పాకిస్తాన్-కేంద్రీకృత ఉగ్రవాదులు 26 మంది పౌరులను (ఎక్కువ మంది టూరిస్టులు) హత్య చేశారు. ఈ దాడికి ప్రతీకారంగా భారత ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ కలిసి మే 7న మిస్సైల్, ఎయిర్ స్ట్రైక్‌లు చేపట్టాయి.
లక్ష్యాలు: పాకిస్తాన్ మరియు PoKలో 9 ఉగ్ర శిబిరాలు, వీటిలో JeM, Lashkar-e-Taiba (LeT), Hizbul Mujahideen సంస్థలు. బహవల్పూర్‌లోని మర్కజ్ సుభాన్ అల్లా (15 ఎకరాల JeM ట్రైనింగ్ సెంటర్) ప్రధాన లక్ష్యం.
పరిణామాలు: భారత ఇంటెలిజెన్స్ ప్రకారం 70 మంది ఉగ్రవాదులు మరణించారు, 60 మంది గాయపడ్డారు. పాకిస్తాన్ మిలిటరీ 26 మరణాలు, 46 గాయాలు అని చెప్పింది.
మసూద్ అజ్హర్ కుటుంబం మీద ప్రభావం:
JeM కమాండర్ మసూద్ ఇల్యాస్ కశ్మీరీ వీడియోలో, “సర్వస్వం త్యాగం చేసిన తర్వాత, మే 7న మౌలానా మసూద్ అజ్హర్ కుటుంబాన్ని భారత దళాలు బహవల్పూర్‌లో ముక్కలు ముక్కలు చేశాయి” అని ఆవేశంగా చెప్పారు. అజ్హర్ సోదరి మరియు ఆమె భర్త.మేనల్లుడు మరియు ఆయన భార్య.మేనకోడలు.ఇతర బంధువుల కుటుంబాల్లోని 5 మంది పిల్లలు. ఒక సహచరుడు మరియు అతని తల్లి, మరో ఇద్దరు అనుచరులు. ఈ దాడిలో మరణించినవారు:
అజ్హర్ తాను గిల్గిట్-బాల్టిస్తాన్ ప్రాంతంలో (PoK) దాగి ఉన్నాడని ఇంటెలిజెన్స్ రిపోర్టులు చెబుతున్నాయి.
మసూద్ అజ్హర్ ఎవరు?
1968లో పాకిస్తాన్‌లో జన్మించిన అజ్హర్, 2000లో JeM స్థాపించాడు. ఇండియాలో పుల్వామా (2019, 40 CRPF జవాన్ల మరణం), పార్లిమెంట్ (2001), పథాంకోట్ (2016) దాడులకు కారకుడు.
1999లో IC-814 విమాన హైజాక్‌లో భారత్ నుంచి విడుదల అయ్యాడు. 2019లో UN “గ్లోబల్ టెర్రరిస్ట్”గా ప్రకటించింది.
