
D Spiritual: Dec 26: గుడి నుంచి ఇంటికి వచ్చిన వెంటనే కాళ్లు కడుక్కోవద్దు లేదా స్నానం చేయొద్దని పెద్దలు చెప్పడానికి లోతైన ఆధ్యాత్మిక కారణం ఉంది. దేవాలయం అనేది ఒక శక్తి కేంద్రంగా భావిస్తారు. అక్కడ జరిగే పూజలు, మంత్రోచ్చారణల వల్ల సానుకూల దైవశక్తి వ్యాప్తి చెందుతుందని శాస్త్రాలు పేర్కొంటాయి.
దేవుని దర్శనం సమయంలో ఆ దైవశక్తి మన శరీరాన్ని, మన ఆరాను స్పర్శించి మనతో పాటు ఇంటికీ వస్తుందని విశ్వాసం. ఈ శక్తి మన చుట్టూ ఒక ఆధ్యాత్మిక రక్షణ వలయంలా పనిచేస్తుందని పెద్దలు చెబుతారు.
అలాంటి సమయంలో వెంటనే నీళ్లతో కాళ్లు కడుక్కోవడం లేదా స్నానం చేయడం వల్ల ఆ దైవశక్తిని మనమే తొలగించుకున్నట్లవుతుందని శాస్త్రాలు సూచిస్తున్నాయి. అందుకే దర్శనం అనంతరం కొంత సమయం వరకు శుద్ధి చర్యలను వాయిదా వేయాలని సూచిస్తారు.
ఇంటికి వచ్చిన తర్వాత కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చొని, దర్శించిన దేవుణ్ణి మనసులో తలుచుకుంటూ ధ్యానం చేయాలని పెద్దలు ఉపదేశిస్తారు. ఇలా చేయడం వల్ల ఆలయం నుంచి వచ్చిన దైవశక్తి మనలో స్థిరపడుతుందని నమ్మకం.
ఆధ్యాత్మిక స్థితి నిలకడగా ఉన్న తరువాతే స్నానం చేయడం శుభప్రదమని పండితులు చెబుతున్నారు. ఇలా ఆచరించడం వల్ల మనస్సు, శరీరం రెండూ సంతులితంగా ఉంటాయని విశ్వాసం ఉంది.
