yash’s Toxic OTT Release Date: Gangster Action Drama to Stream Soon

D News: కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా, నేషనల్ అవార్డ్ విన్నర్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా ‘టాక్సిక్’ ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోంది. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో నయనతార, రుక్మిణి వసంత్, హుమా ఖురేషి, తారా సుతారియా కీలక పాత్రల్లో కనిపించారు.

భారీ అంచనాలతో విడుదల.. కానీ ఆశించిన స్థాయిలో స్పందన లేదు

యష్ తన Monster Mind Creations బ్యానర్‌పై KVN ప్రొడక్షన్స్‌తో కలిసి నిర్మించిన ఈ పాన్ ఇండియా మూవీ భారీ బడ్జెట్‌తో రూపొందింది. ఆగస్టు 26న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. పాజిటివ్ టాక్ కంటే నెగెటివ్ రెస్పాన్స్ ఎక్కువగా కనిపించింది.

సెప్టెంబర్ 25 నుంచి ఓటీటీలోకి?

ఇప్పటికే ‘టాక్సిక్’ డిజిటల్ హక్కులను ZEE5 సొంతం చేసుకున్నట్లు సమాచారం. తాజా టాక్ ప్రకారం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ వెర్షన్లు సెప్టెంబర్ 25 నుంచి ZEE5లో స్ట్రీమింగ్ కానున్నాయి. ఇక హిందీ వెర్షన్ మాత్రం అక్టోబర్ 23 నుంచి అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ ఓటీటీ తేదీలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. థియేటర్లలో ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయిన ‘టాక్సిక్’.. ఓటీటీలో ఎలాంటి స్పందన తెచ్చుకుంటుందో చూడాలి.

By Avinash