
DET:OCT31:
యష్ టాక్సిక్:విడుదల వాయిదా లేదు,చెప్పిన తేదికే వస్తోంది!
కేజీఎఫ్ సినిమాతో దేశవ్యాప్తంగా రాకింగ్ స్టార్ గా ఎదిగిన హీరో యష్ నటిస్తున్న తదుపరి చిత్రం టాక్సిక్:
ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్.జాతీయ అవార్డు గ్రహీత గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో,సినీ వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి.ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్నప్పటికీ,ఇటీవల విడుదల తేదీ వాయిదా పడుతుందంటూ కొన్ని పుకార్లు వచ్చాయి.
పుకార్లకు చెక్ పెట్టిన నిర్మాతలు:
టాక్సిక్ సినిమా విడుదల తేదీ వాయిదా పడుతుందనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.ముఖ్యంగా,షూటింగ్ ఆలస్యం కావడం లేదా హీరో యష్‌కి,దర్శకురాలు గీతూ మోహన్‌దాస్‌కి మధ్య కొన్ని క్రియేటివ్ విభేదాలు ఉన్నాయనే ఊహాగానాలు వినిపించాయి.అయితే, ఈ రూమర్లపై చిత్ర యూనిట్ తాజాగా స్పష్టత ఇచ్చింది.ప్రముఖ ఫిల్మ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్‌తో మాట్లాడిన చిత్ర నిర్మాతలు, విడుదల తేదీలో ఎలాంటి మార్పు లేదని ఖరారు చేశారు.
ఖరారైన విడుదల తేదీ:మార్చి 19,2026:
టాక్సిక్ సినిమా మునుపటి ప్రకటన ప్రకారం మార్చి 19,2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.ఈ తేదీకి అనుగుణంగానే పనులు జరుగుతున్నాయని నిర్మాతలు తెలిపారు.పోస్ట్-ప్రొడక్షన్ పనులు,విజువల్ ఎఫెక్ట్స్ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని,సినిమా ప్రమోషన్స్ వచ్చే ఏడాది జనవరి నుంచి పూర్తిస్థాయిలో మొదలవుతాయని కూడా వెల్లడించారు.ఈ విషయాన్ని ధృవీకరిస్తూ,నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ సోషల్ మీడియాలో మరో 140 రోజులే…అతని కట్టడి లేని ఉనికి,మీ ఉనికికి సంక్షోభం” అని పోస్ట్ చేసి, విడుదల తేదీని మరోసారి స్పష్టం చేసింది.
పండుగ సీజన్‌లో భారీ రిలీజ్:
మార్చి 19,2026 విడుదల తేదీ పండుగ సీజన్‌కు అనుకూలంగా ఉండటం విశేషం.ఆ సమయంలో ఉగాది,గుడి పడ్వా వంటి ప్రాంతీయ నూతన సంవత్సర వేడుకలు,ఆ తర్వాత ఈద్ పండుగ కూడా రానున్నాయి.ఈ పండుగ సెలవులన్నీ సినిమాకు భారీ ఓపెనింగ్స్, బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు సాధించడానికి దోహదపడతాయని మేకర్స్ భావిస్తున్నారు.ఈ చిత్రం కన్నడ,ఇంగ్లీష్ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరిస్తూ,తెలుగు,తమిళం,మలయాళం,హిందీతో సహా పలు భాషల్లో విడుదల కానుంది.కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అక్షయ్ ఒబెరాయ్ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు.
