
DET:OCT31:
SSMB29 టీజర్ ముందు మాల్దీవుల్లో మహేష్ బాబు వెకేషన్:
సూపర్‌స్టార్ మహేష్ బాబు తన తాజా ప్రాజెక్ట్ SS రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న SSMB29 షూటింగ్ నుండి కాస్త విరామం తీసుకుని కుటుంబంతో కలిసి మాల్దీవులకు వెళ్లారు.ఈ వెకేషన్ ఫోటోలను ఆయన తన సోషల్ మీడియాలో పంచుకున్నారు.ఈ ఫోటోలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
వైరల్ అవుతున్న మహేష్ బాబు లుక్:
మాల్దీవుల బీచ్‌లో వైట్ టీ-షర్ట్‌లో ఉన్న మహేష్ బాబు ఫోటోను ఆయన పోస్ట్ చేశారు.ఫోటోలో మహేష్ కెమెరాకు వీపు చూపిస్తూ,సముద్రం మధ్యలో ఒక చెక్క మెట్లపైకి ఎక్కుతున్నట్లుగా కనిపించారు.ఈ ఫోటోకు “Absolute bliss!” అని క్యాప్షన్ ఇచ్చారు.ఆయన లుక్ చాలా రిలాక్స్‌డ్‌గా,కొత్త హెయిర్‌స్టైల్‌తో కనిపించడంతో,ఫ్యాన్స్ ఈ లుక్ SSMB29 సినిమా కోసమే అయ్యి ఉంటుందని ఊహాగానాలు మొదలుపెట్టారు.
ఫ్యాన్స్ స్పందన:అసలు సిసలైన తుఫాన్:
మహేష్ బాబు పోస్ట్ చేసిన ఈ ఫోటోకి అభిమానులు భారీగా స్పందించారు.కామెంట్లలో ఆయనను అసలు సిసలైన తుఫాన్ అని,సింహం కూడా ఈత కొట్టగలదు’అని కొనియాడారు.రాజమౌళి సినిమా కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు,ఆయన రిలాక్స్‌డ్ లుక్ మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది.
SSMB29 టీజర్ అప్‌డేట్ కోసం ఎదురుచూపులు:
SSMB29 చిత్రంపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.ఇది ఒక గ్లోబ్‌ట్రాటింగ్ అడ్వెంచర్ లా ఉంటుందని తెలుస్తోంది.ఈ చిత్రం గురించి మరింత సమాచారం,ముఖ్యంగా గ్లింప్స్ లేదా టీజర్‌ను నవంబర్‌లో విడుదల చేస్తామని రాజమౌళి ఇదివరకే ప్రకటించారు. అందుకే,ఈ వెకేషన్ తర్వాత తిరిగి షూటింగ్‌లో పాల్గొనే మహేష్ బాబు ఆ టీజర్ కోసం అభిమానులతో కలిసి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా మరియు పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నట్లు సమాచారం.
