D Spiritual: Sept 1: వేములవాడ రాజన్న ఆలయ లడ్డూ ప్రసాదంలో పురుగు కనిపించిందని ఓ భక్తుడు ఆందోళన వ్యక్తం చేశారు.

సిరిసిల్లకు చెందిన గుజ్జుల సంతోష్‌కుమార్ సోమవారం స్వామివారి దర్శనం అనంతరం ఆలయంలో లడ్డూ ప్రసాదాన్ని కొనుగోలు చేశారు. అనంతరం లడ్డూ తినే సమయంలో అందులో పురుగు కనిపించిందని ఆయన తెలిపారు.

ఈ విషయాన్ని ఆలయ అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించినప్పటికీ.. వారి నుంచి సరైన స్పందన లభించలేదని సంతోష్‌కుమార్ ఆరోపించారు.

ఈ ఘటనపై ఆలయ అధికారులు సమగ్ర విచారణ చేపట్టి, ప్రసాదం తయారీ, నిల్వ, పంపిణీ ప్రక్రియల్లో లోపాలను గుర్తించాలని భక్తులు కోరుతున్నారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.