
DSports 10Mar 2026:అహ్మదాబాద్: టీ20 ప్రపంచకప్లో భారత్ చారిత్రాత్మక విజయం సాధించిన వేళ, టీమిండియా స్టార్ ఫినిషర్ రింకు సింగ్ సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ నెటిజన్లను కలచివేస్తోంది. టోర్నీ జరుగుతున్న సమయంలోనే తన తండ్రిని కోల్పోయిన రింకు, ఈ విజయాన్ని ఆయనకు అంకితం చేస్తూ భావోద్వేగానికి లోనయ్యాడు.
- ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత రింకు సింగ్ తన ఇన్స్టాగ్రామ్లో తన తండ్రితో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేస్తూ ఇలా రాసుకొచ్చాడు:”నాన్న.. మీతో మాట్లాడకుండా ఇన్ని రోజులు ఎప్పుడూ లేను. మీ వాయిస్ వినకుండా రోజులు గడపడం నాకు చాలా కష్టంగా ఉంది. మీరు ఎప్పుడూ చెప్పేవారు.. ‘బాధ్యతే అన్నింటికంటే ముఖ్యం’ అని. అందుకే మైదానంలోకి దిగినప్పుడు నా గుండె భారంగా ఉన్నా, మీ కల నిజం చేయాలనే పట్టుదలతో ఆడాను. ఈరోజు మీ కల నెరవేరింది.. మనం ప్రపంచకప్ గెలిచాం! కానీ ఈ విజయాన్ని చూసేందుకు మీరు నా పక్కన లేరన్నదే పెద్ద వెలితి.”
