DSports 31 Oct: మహిళల వన్డే ప్రపంచ కప్ 2025లో భారత జట్టు సంచలనం సృష్టించింది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను సెమీఫైనల్‌లో ఓడించి, మూడోసారి ఫైనల్‌ బెర్త్‌ను ఖాయం చేసుకుంది.

భారత ఇన్నింగ్స్ 339 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించిన భారత జట్టు 48.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 341 పరుగులు చేసి విజయం సాధించింది.వన్డే ప్రపంచ కప్ చరిత్రలోనే అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన భారత మహిళల జట్టుగా రికార్డు సృష్టించింది.భారత విజయంలో జెమీమా రోడ్రిగ్స్ (134 బంతుల్లో 127 నాటౌట్) అద్భుతమైన సెంచరీతో కీలక పాత్ర పోషించింది. ఆమెకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (88 బంతుల్లో 89) మెరుపు ఇన్నింగ్స్‌తో రాణించింది.జెమీమా, హర్మన్‌ప్రీత్ కౌర్ మూడో వికెట్‌కు 167 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

ఆస్ట్రేలియా ఇన్నింగ్స్టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా జట్టు 49.5 ఓవర్లలో 338 పరుగులకు ఆలౌట్ అయింది.ఆసీస్ బ్యాటర్లలో ఫోబీ లిచ్‌ఫీల్డ్ (119) సెంచరీతో, ఎలీస్ పెర్రీ (77), ఆష్లే గార్డ్‌నర్ (63) అర్ధ సెంచరీలతో రాణించారు.భారత బౌలర్లలో శ్రీచరణి, దీప్తి శర్మ చెరో రెండు వికెట్లు తీశారు.

ఫైనల్ సమరం:
మహిళల ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ ఆదివారం జరగనుంది.

ఫైనల్‌లో భారత్, తొలి సెమీస్‌లో ఇంగ్లండ్‌ను ఓడించిన దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana