
D Entr: Jul 15: లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమా ఇండస్ట్రీలో దాదాపు 22 ఏళ్లుగా తన స్టార్‌డమ్‌ను నిలబెట్టుకుంటూ అగ్ర కథానాయికగా కొనసాగుతోంది. కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రలు, సెకండ్ హీరోయిన్ రోల్స్ చేసిన నయన్.. రజినీకాంత్ నటించిన చంద్రముఖి, సూర్య హీరోగా వచ్చిన గజినీ చిత్రాల్లో రెండో హీరోయిన్‌గా కనిపించింది. అనంతరం ప్రధాన కథానాయికగా అవకాశాలు అందిపుచ్చుకుని వరుస విజయాలతో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది.
తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నయనతార, కమర్షియల్ చిత్రాలతో పాటు మహిళా ప్రాధాన్యత ఉన్న సినిమాల్లోనూ నటిస్తూ తన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తోంది. స్టార్ హీరోలకు సమానంగా పారితోషికం అందుకుంటూ ఇండస్ట్రీలో అత్యంత డిమాండ్ ఉన్న హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతోంది.
ఇటీవల మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘విశ్వంభర’ సినిమాలో నయనతార నటిస్తోందనే ప్రచారం జరిగినప్పటికీ, ప్రస్తుతం ఆమె వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం నయనతార ఒక్కో సినిమాకు రూ.25 నుంచి రూ.30 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ స్థాయిలో రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోయిన్‌గా ఆమె పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
ఇదిలా ఉండగా, ఇప్పుడు నయనతార మరో మెగా ప్రాజెక్ట్‌లో నటించే అవకాశముందని సినీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న చిత్రంలో ఆమె కీలక పాత్ర పోషించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
రంగస్థలం వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత రామ్ చరణ్–సుకుమార్ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రానికి సంబంధించి అధికారిక ప్రకటనలు ఇంకా వెలువడలేదు. అయితే ఇందులో నయనతారకు కీలక పాత్ర దక్కిందని, రామ్ చరణ్‌కు అక్క పాత్రలో ఆమె కనిపించే అవకాశం ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
