
DNews Dec18 2025:హైదరాబాద్: తెలుగు చలనచిత్ర పరిశ్రమను పైరసీతో వణికించిన ‘ఐబొమ్మ’ వెబ్‌సైట్ నిర్వాహకుడు ఇమ్మంది రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మూడోసారి కస్టడీలోకి తీసుకున్నారు. నాంపల్లి కోర్టు అనుమతితో చంచల్‌గూడా జైలులో రిమాండ్‌లో ఉన్న రవిని గురువారం (డిసెంబర్ 18, 2025) ఉదయం పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు.కొత్త సినిమాలు విడుదలైన గంటల్లోనే ఐబొమ్మలో ప్రత్యక్షం కావడం వల్ల టాలీవుడ్‌కు వందల కోట్ల నష్టం వాటిల్లింది. రవిని విచారించి ఈ నెట్‌వర్క్‌ను పూర్తిగా తుడిచిపెట్టగలిగితే పరిశ్రమకు పెద్ద ఊరట లభిస్తుందని నిర్మాతలు భావిస్తున్నారు.
