DET:MAR 02:
డెకాయిట్ టీమ్ తిరుమల యాత్ర:
వరుస విజయాలతో దూసుకుపోతున్న అడివి శేష్,మోస్ట్ వాంటెడ్ మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న భారీ యాక్షన్ డ్రామా డెకాయిట్.ఈ సినిమా త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ప్రారంభించే ముందు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.ఈ ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామివారిని దర్శించుకుని సినిమా ఘనవిజయం సాధించాలని మొక్కులు చెల్లించుకున్నారు.

ట్రెడిషనల్ లుక్‌లో మెరిసిన జంట:
దర్శనానంతరం ఆలయం వెలుపల మీడియా కంటపడిన ఈ జంట ఎంతో సంప్రదాయబద్ధంగా కనిపించారు.మృణాల్ ఠాకూర్ పట్టు చీరలో అడివి శేష్ తెల్లటి కుర్తా పైజామాలో ఎంతో హుందాగా కనిపించి అందరినీ ఆకట్టుకున్నారు.వీరికి ఆలయ పండితులు వేద ఆశీర్వచనం అందించి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.వీరిని చూసేందుకు అభిమానులు ఎగబడటంతో కొద్దిసేపు అక్కడ సందడి వాతావరణం నెలకొంది.

తొలిసారిగా అడివి శేష్ – మృణాల్ కాంబో:

డెకాయిట్ సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి.అడివి శేష్ తన మార్క్ గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో ఈ కథను సిద్ధం చేయగా షానీల్ డియో దర్శకత్వం వహిస్తున్నారు.ఇది ఒక ఇంటెన్స్ లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా ఉండబోతోంది.మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో మునుపెన్నడూ చూడని ఒక విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నారని సమాచారం.తిరుమల ఆశీస్సులతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డెకాయిట్ లాగే వసూళ్లను దోచుకుంటుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.