
DET:JAN 23:
ఎన్టీఆర్ ఆరోగ్య పరిస్థితిపై స్పష్టత:
గత కొన్ని రోజులుగా ఎన్టీఆర్ అనారోగ్యంతో బాధపడుతున్నారని అందుకే షూటింగ్ ఆగిపోయిందని వార్తలు వస్తున్నాయి.అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్కు తీవ్రమైన ఆరోగ్య సమస్యలేవీ లేవు.ఆయన కేవలం స్వల్ప జలుబు,జ్వరంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం ఆయన ఇంటి వద్దే ఉండి విశ్రాంతి తీసుకుంటున్నారు.ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలని అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షిస్తున్నారు.
షూటింగ్కు తాత్కాలిక విరామం:
హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో డ్రాగన్ సినిమాకు సంబంధించిన కీలకమైన నైట్ షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది.అయితే ఎన్టీఆర్ అనారోగ్యం కారణంగా ఈ షూటింగ్కు చిత్ర యూనిట్ తాత్కాలికంగా విరామం ప్రకటించింది.ఆయన పూర్తిగా కోలుకున్న తర్వాతే మళ్లీ కెమెరా ముందుకు రానున్నారు.ఈ చిన్న బ్రేక్ వల్ల సినిమా పనులకు పెద్దగా ఆటంకం కలగదని మేకర్స్ భావిస్తున్నారు.
ప్రశాంత్ నీల్ డ్రాగన్ అప్డేట్:
ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని అత్యున్నత సాంకేతిక విలువలతో భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాలో ఎన్టీఆర్ మునుపెన్నడూ చూడని సరికొత్త లుక్లో కనిపించబోతున్నారు.ఇప్పటికే విడుదలైన కొన్ని లీక్డ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తుండగా బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్,మలయాళ స్టార్ టోవినో థామస్ కీలక పాత్రల్లో కనిపిస్తారని సమాచారం.
విడుదల తేదీలో మార్పులు?
మొదట ఈ సినిమాను 2026 జనవరిలో విడుదల చేయాలని చిత్ర బృందం భావించింది.కానీ షూటింగ్ షెడ్యూల్స్ మారడం మరియు భారీ విజువల్ ఎఫెక్ట్స్ పనుల కారణంగా ఈ సినిమా విడుదలను 2026 జూన్ 26వ తేదీకి వాయిదా వేసినట్లు తెలుస్తోంది.ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా అంటే మే 20న ఈ సినిమా నుంచి ఒక అదిరిపోయే గ్లింప్స్ విడుదల చేసేందుకు ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నారు.
