DNews : Dec 02: హైదరాబాద్‌ శామీర్‌పేట్‌ పోలీస్‌ స్టేషన్‌ జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక గుర్తింపు సాధించింది. కేంద్ర గృహ మంత్రిత్వ శాఖ ప్రతి సంవత్సరం ప్రకటించే ఉత్తమ పోలీస్‌ స్టేషన్ల జాబితాలో ఇది ఏడవ స్థానంలో నిలిచింది. ఈ విజయానికి పోలీస్‌ స్టేషన్‌ సిబ్బంది కృషి కారణమైంది. నేర బాధితులకు గౌరవం, న్యాయం అందించడమే లక్ష్యంగా రిసెప్షన్‌ విభాగంలో ఎనిమిది మంది సిబ్బందిని నియమించారు. లైంగిక నేరాల బాధితుల వివరాలను సేకరించడానికి ప్రత్యేకంగా మహిళా సిబ్బందిని మాత్రమే నియమించడం జరిగింది. బాధితులు ఫిర్యాదు చేసిన వెంటనే ఎఫ్‌ఐఆర్‌ ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ అవుతుంది. స్టేషన్‌ ప్రాంగణాన్ని శుభ్రంగా, ఆకుపచ్చగా ఉంచేందుకు తోటపని, పరిశుభ్రతపై దృష్టి పెట్టారు. ఫిర్యాదు దారులకు అవసరమైన సౌకర్యాలు కల్పించారు. మహిళా సిబ్బందికి ప్రత్యేకంగా బ్యారక్స్‌ ఏర్పాటు చేశారు. “ఫిర్యాదు దారులను మర్యాదగా చూడాలని సిబ్బందిని ప్రోత్సహించాం. మహిళలకు సహాయం అందించేందుకు హెల్ప్‌డెస్క్‌ ఏర్పాటు చేశాం. పోలీస్‌ స్టేషన్‌ వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మార్చాం. గత సంవత్సరం రాష్ట్ర స్థాయిలో రెండో స్థానంలో నిలిచిన శామీర్‌పేట్‌ ఈసారి మరింత మెరుగైన పనితీరుతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది” అని ఇన్‌స్పెక్టర్‌ శ్రీనాథ్‌ తెలిపారు. ఈ ర్యాంకింగ్‌లో పరిగణనలోకి తీసుకున్న అ–పరిశీలన, ఫిర్యాదుల పరిష్కారం, సిబ్బంది ప్రవర్తన, గస్తీ చర్యలు, స్టేషన్‌ పరిశుభ్రత–హరితవనం, మహిళలపై నేరాల కేసుల పర్యవేక్షణ, తీర్పుల శాతం, సమాజానికి దగ్గరగా పోలీసింగ్‌ విధానం.

By Mosha

పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana