
DNews: May 07: హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు ఆ తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా హైడ్రా విస్తరణకు నిర్ణయం తీసుకున్నది. ప్రజల నుండి హైడ్రా విస్తరణకు విపరీతమైన అభ్యర్థనలు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. గురువారం మిర్యాలగూడను సందర్శించిన రంగనాథ్, NSP అతిథి గృహంలో మీడియాతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ హైడ్రాకు వేల సంఖ్యలో ఆక్రమణలపై ఫిర్యాదులు అందాయని, వాటిని పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
ప్రజా విచారణను నాలుగు వారాలపాటు రద్దు చేసినట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న దరఖాస్తులను పరిష్కరించడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. కొంతమంది హైడ్రా వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయిస్తున్నారని తెలిపారు. ఇప్పటివరకు సుమారు రూ. 85 వేల కోట్ల విలువైన భూములను ఆక్రమణల నుండి రక్షించామని, వచ్చే ఏడాదిలో లక్షల కోట్ల విలువైన భూములను రక్షించనున్నామని ఆయన స్పష్టం చేశారు. హైడ్రా పరిధిలో సుమారు రూ. 10 లక్షల కోట్ల విలువైన భూములు ఆక్రమించబడ్డాయని సమాచారం ఉందని రంగనాథ్ వెల్లడించారు.
ఈ చర్యలతో రాష్ట్రంలో భూముల రక్షణకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయని, ప్రజల సహకారంతో హైడ్రా మరింత బలంగా పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు.
