
DNews: Apr 30: హైదరాబాద్‌లో డీజీపీ శివధర్ రెడ్డి తన 32 ఏళ్ల పోలీసు సేవా ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ భావోద్వేగంగా స్పందించారు. ఆయన తన కెరీర్లో ఎదుర్కొన్న సమస్యలు, ఆనందాలు, అనుభవాలు, జ్ఞాపకాలను పంచుకున్నారు. 1970, 1980 దశకాలలో పోలీసుల పరిస్థితులు వేరుగా ఉండేవని, ప్రస్తుతం పనిచేస్తున్న పోలీసు సిబ్బంది పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉన్నాయని అన్నారు. గతంతో పోలిస్తే ప్రస్తుత పోలీసింగ్‌లో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయని, ప్రజలకు అనుకూలంగా ఉండే పోలీసింగ్ అవసరమని సూచించారు. ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా ప్రజా మైత్రి పోలీసింగ్‌ను అమలు చేశామని, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా పోలీసు శాఖను సిద్ధం చేశామని తెలిపారు.
“నా స్వస్థల రాష్ట్రానికి డీజీపీగా నియమించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు. ఆయన నాపై ఎన్నో కీలక బాధ్యతలు ఉంచారు. నన్ను ఈ స్థాయికి తీసుకువచ్చిన గురువులకు కృతజ్ఞతలు. యువ పోలీసుల ద్వారా శాఖకు మంచి పేరు రావాలి. పోలీసు శక్తి అంటే గౌరవంగా జీవించడం. నేను ఈ స్థాయికి చేరుకోవడం సమిష్టి కృషి వల్లే సాధ్యమైంది. నా కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు. ఒక మంచి సవాళ్లను ఎదుర్కొనే అధికారి వస్తున్నారు. రాష్ట్ర కొత్త డీజీపీగా సీవీ ఆనంద్కి అభినందనలు,” అని శివధర్ రెడ్డి అన్నారు.
