DSports 25 Nov:హైదరాబాద్: భారత క్రికెట్ అభిమానులకు పాత రోజులను గుర్తుచేస్తూ, సీనియర్ ఆటగాళ్లు శిఖర్ ధావన్ (Shikhar Dhawan) మరియు హర్భజన్ సింగ్ (Harbhajan Singh) మరోసారి మైదానంలోకి అడుగుపెట్టనున్నారు. రిటైర్ అయిన ఇతర స్టార్ ఆటగాళ్లతో కలిసి వీరిద్దరూ ‘లెజెండ్స్ ప్రో టీ20 లీగ్’ లో ఆడనున్నారు.

యువ ఆటగాళ్లుగా తమ అద్భుత ప్రదర్శనలతో అలరించిన ఈ మాజీ క్రికెటర్లు ఇప్పుడు ‘లెజెండ్స్’ హోదాలో క్రికెట్ ఫెస్టివల్‌లో భాగం కానున్నారు.

ఈ కొత్త టీ20 లీగ్ యొక్క తొలి ఎడిషన్ 2026 జనవరి 26 నుండి ఫిబ్రవరి 4 వరకు గోవాలో జరగనుందఈ లీగ్‌లో శిఖర్ ధావన్, హర్భజన్ సింగ్‌తో పాటు షేన్ వాట్సన్ , డేల్ స్టెయిన్ వంటి అంతర్జాతీయ దిగ్గజాలు కూడా పాల్గొననున్నారు.మాజీ ఆస్ట్రేలియా కెప్టెన్ మైఖేల్ క్లార్క్ ఈ లీగ్‌కు లీగ్ కమిషనర్‌గా వ్యవహరించనున్నారు.

క్రికెట్ అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఈ మెరుపుల విందు, దిగ్గజాల ఆటతీరును మరోసారి కళ్లారా చూసే అవకాశం కల్పిస్తుంది. ముఖ్యంగా, ‘గబ్బర్’ శిఖర్ ధావన్ మరియు టర్బోనేటర్ హర్భజన్ సింగ్ బ్యాట్, బాల్‌తో ఏ రేంజ్‌లో రఫ్ఫాడిస్తారో చూడాలని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు!

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana