
DSports 8 Dec:విశాఖపట్నం: భారత క్రికెట్ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, యువ పేసర్ అర్ష్దీప్ సింగ్ కలిసి చేసిన సరదా రీల్ (Reel) సోషల్ మీడియాలో సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ వీడియో కేవలం ఒక్క రోజులోనే 10 కోట్లకు పైగా వీక్షణలను (100 Million Views) దక్కించుకొని విపరీతంగా వైరల్ అవుతోంది.
- విశాఖ విజయం తర్వాతే..
దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు వన్డేల సిరీస్ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. విశాఖపట్నంలో జరిగిన మూడో, చివరి వన్డేలో భారత్ తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ అజేయంగా 65 పరుగులు చేసి జట్టును గెలిపించారు. - విశాఖ మ్యాచ్లో రాత్రి మంచు ప్రభావం బౌలర్లపై చాలా ఎక్కువగా ఉంది. దీనినే ప్రస్తావిస్తూ కోహ్లీ ఇచ్చిన చమత్కారమైన సమాధానం క్రికెట్ అభిమానులను ఎంతగానో నవ్వించింది.
