DSports 8 Dec:న్యూఢిల్లీ: భారత స్టార్ ఆర్చర్, తెలుగు తేజం వెన్నం జ్యోతి సురేఖ తన అద్భుతమైన ప్రదర్శనను కొనసాగిస్తూ తాజాగా చైనీస్‌ తైపీలో జరిగిన తైపీ ఆర్చరీ ఓపెన్ 2025 టోర్నమెంట్‌లో కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. అంతర్జాతీయ ఆర్చరీ వేదికపై సురేఖ మరోసారి భారత్ జెండాను రెపరెపలాడించింది.

విజయవాడకు చెందిన జ్యోతి సురేఖ.. ఆర్చరీలో అంతర్జాతీయంగా అత్యధిక పతకాలు సాధించిన భారత క్రీడాకారిణుల్లో ఒకరు. ఆమె ఇప్పటికే ఆసియా క్రీడలతో పాటు అనేక ప్రపంచకప్ ఈవెంట్లలో స్వర్ణ, రజత పతకాలను గెలుచుకుని భారత ఆర్చరీ చరిత్రలో చెరగని ముద్ర వేశారు. ఇటీవల ముగిసిన ఆర్చరీ ప్రపంచకప్ ఫైనల్స్‌లో కూడా ఆమె కాంస్య పతకం సాధించి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే.

ఈ విజయం ద్వారా, రాబోయే అంతర్జాతీయ టోర్నమెంట్‌లలో సురేఖపై అంచనాలు మరింత పెరిగాయి.

By Deepak

పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana