
DET:DEC 10:
బిగ్‌బాస్ హోస్టింగ్ చేయకూడదనుకున్న విజయ్ సేతుపతి!
నటుడు విజయ్ సేతుపతి తాను బిగ్‌బాస్ షోకి హోస్ట్‌గా చేయాలని అనుకోలేదని ఇటీవల చెప్పారు.ఈ విషయంలో ఆయన తెలుగు బిగ్‌బాస్ హోస్ట్ నాగార్జున గారి లాగే ఉన్నారని తెలిపారు.అంటే నాగార్జున గారు కూడా మొదట్లో తెలుగు బిగ్‌బాస్ హోస్ట్ చేయడానికి ఇష్టపడలేదని విజయ్ సేతుపతి ప్రస్తావించారు.
హోస్టింగ్‌పై విజయ్ సేతుపతి అభిప్రాయం:
ఒక రియాలిటీ షోను హోస్ట్ చేయాలనే విషయంలో తనకు సరైన అవగాహన లేదని విజయ్ సేతుపతి అన్నారు.అంతేకాకుండా తాను ప్రేక్షకుడిగా కూడా ఆ కార్యక్రమాన్ని పెద్దగా చూడలేదనే విషయాన్ని కూడా ఆయన చెప్పారు.ఈ కారణాల వల్లనే తాను బిగ్‌బాస్ హోస్ట్ చేయడానికి మొదట్లో అంత సుముఖంగా లేనని స్పష్టం చేశారు.అయితే తర్వాత ఆయన బిగ్‌బాస్ తమిళ్ సీజన్ 8కి హోస్ట్‌గా వ్యవహరించారు.
నాగార్జున గారిపై సరదా వ్యాఖ్యలు:
బిగ్‌బాస్ కొత్త సీజన్ల ప్రకటన సందర్భంగా జరిగిన ఒక ఈవెంట్లో విజయ్ సేతుపతి.తెలుగు బిగ్‌బాస్ హోస్ట్ నాగార్జున గారిపై సరదాగా వ్యాఖ్యలు చేశారు.నాగార్జున గారు తన చిన్నతనంలో టీవీలో ఎలా కనిపించారో,ఇప్పుడు కూడా సరిగ్గా అలాగే ఉన్నారని,ఆయనకు ఏజ్ అసలు పెరగట్లేదని చమత్కరించారు.యాంటీ ఏజింగ్‌పై రీసెర్చ్ చేసేవారు నాగార్జున గారిని పరిశోధించాలని,ఆయన హెయిర్ స్టైల్ నుంచి అన్ని చాలా బాగుంటాయని,కూల్‌గా ఎనర్జిటిక్‌గా కనిపిస్తారని విజయ్ సేతుపతి నవ్వుతూ చెప్పారు.భవిష్యత్తులో తన మనవలు వచ్చినా కూడా ఆయన ఇలాగే కనిపిస్తారని జోక్ చేశారు.
బిగ్‌బాస్ హోస్టింగ్ అనుభవం:
బిగ్‌బాస్ లాంటి షోలను హోస్ట్ చేయడం అనేది ఒక ఓపెన్ బుక్ చదివినట్లుగా ఉంటుందని విజయ్ సేతుపతి అభిప్రాయపడ్డారు.ఈ షోను హోస్ట్ చేయడం ద్వారా మనుషులు ఎలా ప్రవర్తిస్తారనే దాని గురించి తాను కూడా చాలా నేర్చుకుంటున్నానని చెప్పుకొచ్చారు.గతంలో కమల్ హాసన్ స్థానంలో విజయ్ సేతుపతి బిగ్‌బాస్ తమిళ్ సీజన్ 8కి హోస్ట్‌గా చేశారు.ఇప్పుడు రాబోయే సీజన్‌కు కూడా ఆయనే హోస్ట్‌గా వ్యవహరించనున్నారు.
