
DSports 2Nov: భారత యువ షట్లర్, ఉన్నతి హుడా (17 ఏళ్లు), ఇటీవల తన కెరీర్‌లో అత్యంత సంచలనాత్మక విజయాలను నమోదు చేసింది. ముఖ్యంగా ఆమె రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత, సీనియర్ క్రీడాకారిణి పీవీ సింధును ఓడించడం భారత బ్యాడ్మింటన్ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశమైంది.2025లో జరిగిన ఈ టోర్నమెంట్ ప్రీ-క్వార్టర్ ఫైనల్స్‌లో ఉన్నతి, సింధును 21-16, 19-21, 21-13 తేడాతో ఓడించి క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది.ఈ విజయం ద్వారా ఉన్నతి సూపర్ 1000 టోర్నీలో క్వార్టర్ ఫైనల్ చేరిన అతి పిన్న వయస్కురాలైన భారత మహిళా క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది. ఒక అంతర్జాతీయ టోర్నమెంట్‌లో సహచర భారత క్రీడాకారిణి చేతిలో సింధు ఓడిపోవడం ఏడేళ్లలో ఇదే తొలిసారి.
ఉన్నతి హుడా నిస్సంకోచంగా ఆడే తీరు మరియు మెరుగైన షాట్ సెలక్షన్ భారత బ్యాడ్మింటన్ భవిష్యత్తుకు శుభ సూచకమని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
