
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన క్యాబినెట్ మంత్రి రాబర్ట్ ఎఫ్. కెన్నడీ ఓవల్ ఆఫీసులో మీడియాతో మాట్లాడుతున్న సమయంలో ఓ యువతి వారి మధ్యలో నిలబడి ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె పొట్టపై చేయి వేసుకుని కనిపించడంతో.. నెటిజన్లు తమకు తోచిన విధంగా పలు ఊహాగానాలు మొదలుపెట్టారు. ట్రంప్‌ను నిద్రలేపేందుకు ఆమె ఎలక్ట్రిక్ షాక్ ఇస్తున్నారంటూ కొందరు సరదాగా కామెంట్లు చేశారు.
ఈ ప్రచారం చూసి ఆ యువతి కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. చివరకు ఈ ఊహాగానాలకు స్పందిస్తూ.. తాను గర్భవతినని, అందుకే సహజంగానే పొట్టపై చేయి వేసుకున్నానని ఆమె స్పష్టం చేశారు. దీంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో వెనుక అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
పిల్లల టీకాలకు సంబంధించిన కీలక ఉత్తర్వుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేస్తున్న సమయంలో ఆయన పక్కన కనిపించిన ఓ యువతి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారారు. ఎక్స్ (ట్విట్టర్)తో పాటు ఇతర సామాజిక మాధ్యమాల్లో ఆమె గురించి పలు రకాల ఊహాగానాలు ప్రచారం అవుతున్నాయి. ట్రంప్ మెలకువగా ఉండేందుకు లేదా నిద్రపోకుండా చూసేందుకు ఆమె ఎలక్ట్రిక్ షాక్ ఇస్తున్నారంటూ కొందరు నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు.
దీంతో అసలు ఆమె ఎవరు? అనే చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో పలువురు నెటిజన్లు, కొన్ని వార్తా సంస్థల కథనాల ప్రకారం.. వైరల్ అవుతున్న ఆ మహిళ కన్జర్వేటివ్ మీడియా, లైఫ్‌స్టైల్ బ్రాండ్ ‘ది కన్జర్వేటర్’ వ్యవస్థాపకురాలు, సీఈఓ జేమీ లీగ్ ఫ్రాంక్లిన్గా గుర్తించారు.
ఓవల్ ఆఫీసులో జరిగిన మీడియా సమావేశంలో తాను పొట్టపై చేయి పెట్టుకున్న దృశ్యాలపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని చూసి జేమీ లీగ్ ఫ్రాంక్లిన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ట్రంప్‌ను నిద్రలేపేందుకు ఆమె ఓ బటన్ నొక్కి ఎలక్ట్రిక్ షాక్ ఇస్తున్నారంటూ కొందరు చేసిన పోస్టులకు స్పందిస్తూ.. తాను గర్భవతిని కావడంతోనే పొట్టపై చేయి పెట్టుకున్నానని స్పష్టం చేశారు.
వైరల్ అవుతున్న వీడియోలో డొనాల్డ్ ట్రంప్, ఆరోగ్య–మానవ సేవల శాఖ మంత్రి రాబర్ట్ ఎఫ్. కెన్నడీ మధ్య ఫ్రాంక్లిన్ నిలబడి ఉన్నారు. ఆ సమయంలో ఆమె పలుమార్లు తల ఊపుతూ, ఒక చేతిని పొట్టపై ఉంచుకుని కనిపించారు. అయితే ఈ దృశ్యాలను ఆధారంగా చేసుకుని సోషల్ మీడియాలో వ్యంగ్యంగా, అసత్య ప్రచారం జరగడంతో ఆమె స్వయంగా వివరణ ఇచ్చారు.
