
DET:DEC 26:
కార్తీక్ ఆర్యన్,అనన్యా పాండే జంటగా నటించిన తాజా చిత్రం తూ మేరీ మెయిన్ తేరా మెయిన్ తేరా తూ మేరీ.క్రిస్మస్ కానుకగా భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది.అయితే థియేటర్ల వద్ద ఇప్పటికే కొనసాగుతున్న ధురందర్ సునామీ ఈ చిత్ర వసూళ్లపై గట్టి ప్రభావం చూపినట్లు కనిపిస్తోంది.
మొదటి రోజు వసూళ్లు:
మొదటి రోజు బాక్సాఫీస్ లెక్కల ప్రకారం ఈ చిత్రం భారత మార్కెట్లో సుమారు ₹7.25 కోట్ల నుండి ₹7.50 కోట్ల మధ్య వసూళ్లను సాధించింది.కార్తీక్ ఆర్యన్ మార్కెట్ స్టామినాతో పోలిస్తే ఇది సాధారణ ఓపెనింగ్ అని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం మొదటి రోజు దాదాపు ₹10 కోట్ల గ్రాస్ మార్కును తాకినట్లు సమాచారం.
ధురందర్ ప్రభంజనం:
ఒకవైపు కొత్త సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చినా మరోవైపు రణవీర్ సింగ్ నటించిన ధురందర్ చిత్రం 21వ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాస్తోంది.ధురందర్ సినిమా కేవలం గురువారం రోజే ₹26 కోట్లు కొల్లగొట్టింది.ఈ చిత్రం ఇప్పటికే ₹1000 కోట్ల క్లబ్లో చేరి గట్టి పోటీనిస్తుండటంతో కార్తీక్ ఆర్యన్ సినిమాకు ఆశించిన స్థాయిలో థియేటర్లు మరియు ఆక్యుపెన్సీ లభించలేదు.
ప్రేక్షకుల స్పందన:
సమీర్ విద్వాన్స్ దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ కామెడీ చిత్రానికి మిశ్రమ స్పందన లభిస్తోంది.కార్తీక్ ఆర్యన్ మరియు అనన్యా పాండేల కెమిస్ట్రీ బాగుందని కొందరు అంటుంటే కథలో కొత్తదనం లేదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా నైట్ షోలలో 40% వరకు ఆక్యుపెన్సీ నమోదు కావడం చిత్ర యూనిట్‌కు కొంత ఊరటనిచ్చే అంశం.
