D News: Aug 12: తెలంగాణ చేయూత పింఛన్లకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం తెలంగాణ చేయూత పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న నిరుపేద కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. కొత్త పింఛన్ల మంజూరుకు అధికారికంగా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా విడతలవారీగా 3 లక్షల నుంచి 3.5 లక్షల మందికి కొత్త పింఛన్లు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సంక్షేమ పథకంలో మహిళలు, దివ్యాంగులు, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వారికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. అర్హత కలిగిన నిరుపేదలు ఈ నెల 31లోపు తమ దరఖాస్తులను సంబంధిత అధికారులకు సమర్పించాలని అధికారులు సూచించారు. వితంతువులు, ఒంటరి మహిళలు, ఫైలేరియా బాధితులు, డయాలసిస్ రోగులు, గీత కార్మికులు, నేత కార్మికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.

దరఖాస్తు చేసుకోవడానికి అర్హతలు, వయోపరిమితులు

కొత్త పింఛన్ల మంజూరులో వివిధ వర్గాలకు వేర్వేరు వయోపరిమితులను నిర్ణయించారు. వితంతు పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునేవారు 18 సంవత్సరాలు నిండి ఉండటంతో పాటు భర్త మరణ ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలి. ఒంటరి మహిళలు భర్త నుంచి విడిపోయి కనీసం ఏడాది పూర్తయినట్లు సంబంధిత పత్రాలను సమర్పించాలి. గ్రామీణ ప్రాంతాల్లో 30 ఏళ్లు, పట్టణ ప్రాంతాల్లో 35 ఏళ్లు నిండిన అవివాహిత మహిళలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

దివ్యాంగుల పింఛన్‌కు ఎలాంటి వయోపరిమితి లేకపోయినా, కనీసం 40 శాతం వైకల్యం ఉండాలి. ఆరోగ్యశ్రీ ద్వారా డయాలసిస్ చేయించుకుంటున్న రోగులకు, గ్రేడ్-2, గ్రేడ్-3 ఫైలేరియా బాధితులకు వయోపరిమితి నుంచి మినహాయింపు కల్పించారు. అలాగే 50 ఏళ్లు నిండిన గీత కార్మికులు, నేత కార్మికులు కూడా ఈ పథకానికి అర్హులు.

దరఖాస్తు విధానం

చేయూత పింఛన్ దరఖాస్తు ఫారాలు అధికారిక పోర్టల్‌లో అందుబాటులో ఉంటాయి. పంచాయతీ కార్యదర్శులు, వార్డు అధికారులు, మున్సిపల్ కమిషనర్ల ద్వారా దరఖాస్తులను స్వీకరించి ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. దరఖాస్తుదారులు ఆధార్ కార్డు, వయసు ధ్రువీకరణ పత్రం, రేషన్ కార్డు లేదా ఆదాయ ధ్రువీకరణ పత్రం, బ్యాంకు పాస్‌బుక్ జిరాక్స్ వంటి పత్రాలను తప్పనిసరిగా సమర్పించాలి.

అనర్హతలు ఇవే

మూడు ఎకరాలకు మించి తడి భూమి లేదా ఏడున్నర ఎకరాలకు మించి పొడి భూమి ఉన్నవారు ఈ పథకానికి అనర్హులు. ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్ట్ సిబ్బంది, నాలుగు చక్రాల వాహనాలు కలిగి ఉన్నవారు కూడా పింఛన్‌కు అర్హులు కారు. కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలు దాటినవారిని కూడా పథకం నుంచి అనర్హులుగా గుర్తిస్తారు.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana