
D Spiritual: Nov 21: తిరుమల: ఏడుకొండల స్వామి శ్రీ వేంకటేశ్వరుడు కొలువుదీరిన తిరుమలలో శనివారం భక్తుల రద్దీ తగ్గింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్మెంట్లకు గాను కేవలం 6 కంపార్ట్మెంట్లు మాత్రమే భక్తులతో నిండాయి. భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు.
దర్శన టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనం పూర్తయ్యేందుకు సుమారు నాలుగు గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు.
ఇదిలా ఉండగా, శుక్రవారం ఒక్కరోజే 56,695 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వీరిలో 24,786 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా శ్రీవారి హుండీకి రూ.4.28 కోట్ల ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు.
అలాగే, శుక్రవారం 1.87 లక్షల మంది భక్తులకు టీటీడీ అన్నప్రసాదం అందించినట్లు వెల్లడించారు.
