

D News: న్యాచురల్ స్టార్ నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ **‘ది ప్యారడైజ్’**పై భారీ అంచనాలు ఉన్నాయి. ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్‌కు మంచి స్పందన వస్తుండటంతో ఈ సినిమాపై కొత్తగా ఓ ప్రచారం మొదలైంది. ఇండియాలో ‘ది ప్యారడైజ్’ టికెట్ రేట్లను భారీగా పెంచబోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి.
టికెట్ రేట్లపై మేకర్స్ క్లారిటీ
ఈ ప్రచారంపై ‘ది ప్యారడైజ్’ టీమ్ స్పందించింది. టికెట్ ధరల పెంపుపై జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం టికెట్ రేట్లు పెంచే విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, అసలు ఆ అంశంపై ఇప్పటివరకు చర్చ కూడా జరగలేదని తెలిపింది.
ప్రస్తుతం ఫోకస్ అంతా సినిమాపైనే..
సినిమా విడుదలకు సంబంధించిన ప్రైసింగ్, ఇతర ఫైనాన్షియల్ అంశాలపై ఇంకా నిర్ణయం తీసుకునే దశకు రాలేదని యూనిట్ పేర్కొంది. ప్రస్తుతం తమ పూర్తి దృష్టి కంటెంట్ డెలివరీ, పోస్ట్ ప్రొడక్షన్ పనులపైనే ఉందని తెలిపింది. ప్రేక్షకులకు మంచి సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ అందించేందుకు టీమ్ కష్టపడుతోందని వెల్లడించింది.
దీంతో ప్రస్తుతానికి ‘ది ప్యారడైజ్’ టికెట్ రేట్ల పెంపు వార్తలు కేవలం రూమర్స్ మాత్రమేనని స్పష్టమైంది. అయితే సినిమా విడుదల సమయానికి పరిస్థితులను బట్టి టికెట్ ధరలపై మేకర్స్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
