The Paradise: Telangana Government Approves Ticket Price Hike and Special Premiere

D News: నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’ విడుదలకు తెలంగాణ ప్రభుత్వం కీలక అనుమతులు ఇచ్చింది. సెప్టెంబర్ 23న సాయంత్రం 6:30 గంటలకు ప్రత్యేక ప్రీమియర్ షోకు అనుమతి ఇవ్వడంతో పాటు టికెట్ ధరల పెంపునకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఈ ప్రత్యేక షో టికెట్ ధరను రూ.500గా నిర్ణయించారు. అలాగే సెప్టెంబర్ 24 నుంచి 27 వరకు మల్టీప్లెక్స్‌ల్లో టికెట్‌పై రూ.94, సింగిల్ స్క్రీన్స్‌లో రూ.48 వరకు అదనంగా వసూలు చేసుకునేందుకు అనుమతి లభించింది.

సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 3 వరకు మల్టీప్లెక్స్‌ల్లో రూ.45, సింగిల్ స్క్రీన్స్‌లో రూ.23 పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతించినట్లు సమాచారం.

అదే సమయంలో నిర్మాతలు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్‌కు రూ.1 కోటి అందించాలనే నిబంధన విధించినట్లు తెలుస్తోంది. దీంతో ‘ది ప్యారడైజ్’ విడుదల సందర్భంగా తెలంగాణలో టికెట్ ధరలు పెరగనున్నాయి.

By Avinash