
D News : నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ది ప్యారడైజ్’ విడుదలైన వెంటనే బాక్సాఫీస్ వద్ద దూకుడు చూపిస్తోంది. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు మొదటి రోజు నుంచే మంచి స్పందన లభిస్తోంది.
తాజా కలెక్షన్ వివరాల ప్రకారం.. ‘ది ప్యారడైజ్’ తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.88 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు చిత్రబృందం వెల్లడించింది. ఈ స్థాయి ఓపెనింగ్‌తో సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. విడుదలకు ముందే ‘జడల్ జమానా’ అంటూ మేకర్స్ పెంచిన హైప్‌కు తగ్గట్టుగానే థియేటర్లలో ప్రేక్షకుల సందడి కనిపిస్తోంది.
సినిమాకు అనిరుధ్ రవిచందర్ అందించిన సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో ఆయన అందించిన నేపథ్య సంగీతం సినిమాకు మరింత మాస్ ఇంపాక్ట్ తీసుకొచ్చినట్లు ప్రేక్షకులు చెబుతున్నారు.
ఇక నాని తన కెరీర్లో ఇప్పటివరకు చూడని మాస్ అవతార్‌లో కనిపించడంతో అభిమానుల్లో మరింత ఉత్సాహం నెలకొంది. శ్రీకాంత్ ఓదెల తనదైన రా అండ్ రస్టిక్ టేకింగ్‌తో సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. తొలి రోజే భారీ వసూళ్లు సాధించిన ‘ది ప్యారడైజ్’ రానున్న రోజుల్లో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి నంబర్లు నమోదు చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
