DET:FEB 24:
వివాదానికి నేపథ్యం:
ఇటీవల విడుదలైన ది కేరళ స్టోరీ 2 ట్రైలర్‌లో చూపించిన కొన్ని సన్నివేశాలపై నటుడు ప్రకాష్ రాజ్ ఘాటుగా స్పందించారు. ముఖ్యంగా బలవంతపు మత మార్పిడిలు మరియు గోమాంసం తినిపించే సన్నివేశాలను ఆయన తప్పుబట్టారు.కేరళలో అన్ని మతాల వారు రకరకాల ఆహారపు అలవాట్లు ఉన్నవారు కలిసి మెలిసి ఉంటారని చెబుతూ అసలైన కేరళ స్టోరీ అంటే శాకాహార సద్య, పోర్క్, బీఫ్ మరియు చేపలు సామరస్యంగా కలిసి ఉండటమే అని ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

దర్శకుడి తీవ్ర విమర్శలు:
ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలపై చిత్ర దర్శకుడు కామాఖ్య నారాయణ్ సింగ్ తీవ్రంగా మండిపడ్డారు.ప్రకాష్ రాజ్‌ను బౌద్ధికంగా దివాళా తీసిన వ్యక్తి అని ఆయన అభివర్ణించారు.ఒకప్పుడు ప్రకాష్ రాజ్‌ను గొప్ప నటుడిగా భావించేవాడినని కానీ ఇప్పుడు ఒక మనిషిగా ఆయన పట్ల అసహ్యం కలుగుతోందని దర్శకుడు పేర్కొన్నారు.సమాజంలో జరుగుతున్న వాస్తవాలను కప్పిపుచ్చి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం భావజాల వైకల్యమని ఆయన విమర్శించారు.

ప్రకాష్ రాజ్ తిరిగి సమాధానం:
దర్శకుడి విమర్శలకు ప్రకాష్ రాజ్ తనదైన శైలిలో బదులిచ్చారు.నేరుగా దర్శకుడి పేరు ఎత్తకుండానే విషయాన్ని ఎందుకు అంత క్లిష్టతరం చేస్తారు? అంతా చాలా సరళంగా ఉన్నప్పుడు అని అర్థం వచ్చేలా మరో పోస్ట్ చేశారు.శాకాహారులు,మాంసాహారులు అందరూ ఎలా కలిసి జీవించవచ్చో వివరిస్తూ ఆయన తన వాదనను సమర్థించుకున్నారు.కేవలం వివాదాల కోసం వాస్తవాలను వక్రీకరించవద్దని ఆయన సూచించారు.

నిర్మాత వివరణ:

ఈ వివాదంపై చిత్ర నిర్మాత విపుల్ షా కూడా స్పందించారు.తమ సినిమా కేరళ రాష్ట్రానికి వ్యతిరేకం కాదని కేవలం అక్కడ జరుగుతున్న కొన్ని సామాజిక రుగ్మతలను మాత్రమే ఎత్తి చూపుతున్నామని చెప్పారు.మొదటి భాగంపై వచ్చిన విమర్శలను దృష్టిలో ఉంచుకుని ఈసారి తాము పూర్తి ఆధారాలతో సినిమాను రూపొందించామని ఎవరైనా తప్పు అని నిరూపిస్తే తాను చిత్ర పరిశ్రమ నుండి తప్పుకుంటానని దర్శకుడు సవాల్ విసిరారు.