DSports 13 Nov :దక్షిణాఫ్రికాతో తలపడేందుకు టీమిండియా సిద్ధమవుతోంది. నవంబర్ 14, శుక్రవారం నుంచి కోల్‌కతాలోని చారిత్రక ఈడెన్ గార్డెన్స్ వేదికగా రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. అయితే, ఈ సిరీస్‌కు సంబంధించి అభిమానులలో తీవ్ర చర్చకు దారితీసిన అంశం ఏమిటంటే, ఈడెన్ గార్డెన్స్‌లో జరగనున్న ఈ టెస్ట్ మ్యాచ్‌ను టీమిండియా తన మాజీ కెప్టెన్, స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ లేకుండా ఆడటం.

కోహ్లీ ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో, గత 15 సంవత్సరాలలో ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టు కోహ్లీ లేకుండా బరిలోకి దిగడం ఇదే తొలిసారి కానుంది. చివరిసారిగా కోహ్లీ లేకుండా ఈ స్టేడియంలో టెస్ట్ మ్యాచ్ జరిగింది 2009-10 కాలంలో. కోహ్లీ నాయకత్వంలోనే టీమిండియా 2019లో బంగ్లాదేశ్‌పై ఈడెన్ గార్డెన్స్‌లో చారిత్రక డే-నైట్ (పింక్ బాల్) టెస్ట్‌ను ఆడింది. ఈ మ్యాచ్‌కు విరాట్ కోహ్లీ సెంచరీతో (136) ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. కోహ్లీ, రోహిత్ శర్మ వంటి సీనియర్లు లేకపోవడంతో, శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని యువ టీమిండియా, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ డిఫెండింగ్ ఛాంపియన్ అయిన దక్షిణాఫ్రికాను ఎదుర్కోబోతున్న ఈ టెస్ట్‌పై ఇప్పుడు తీవ్ర ఆసక్తి నెలకొంది.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana