
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు బుధవారం ప్రారంభమయ్యాయి. సభలో తహసీల్దార్ కార్యాలయాల అంశంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమాధానమిచ్చారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తహసీల్దార్ కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.640 కోట్లతో కొత్త ఎమ్మార్వో కార్యాలయాల నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు మంత్రి వెల్లడించారు. ఇప్పటికే కార్యాలయాల నిర్మాణానికి సంబంధించి టెండర్లు పిలిచామని చెప్పారు. అవసరమైన ప్రాంతాల్లో ఎమ్మార్వో, ఆర్డీవో కార్యాలయాలను నిర్మించనున్నట్లు స్పష్టం చేశారు.
ఆదిలాబాద్‌లో నిర్మాణంలో ఉన్న తహసీల్దార్ కార్యాలయాన్ని త్వరగా పూర్తి చేసి ప్రారంభిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
