హైదరాబాద్‌లోని పబ్లిక్‌ గార్డెన్స్‌లోని అసెంబ్లీ హాల్‌లో మూడో తెలంగాణ శాసనసభ 8వ సెషన్‌ రెండో సమావేశం కొనసాగుతోంది. స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ అధ్యక్షతన రెండో రోజు సమావేశాలు ప్రారంభమయ్యాయి.

తొలుత ప్రశ్నోత్తరాల కార్యక్రమం నిర్వహించనున్నారు. అనంతరం సంతాప తీర్మానాలు, పలు కీలక శాసన పత్రాలు, పరిపాలనా నివేదికలను సభలో ప్రవేశపెట్టనున్నారు.

ముఖ్యమంత్రి ఏ. రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, అధికార పక్ష ఎమ్మెల్యేలతో పాటు ప్రతిపక్ష నేతలు సమావేశాల్లో పాల్గొంటున్నారు.

రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై రెండో రోజు సభలో చర్చ జరగనుంది. సాగునీటి ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ, సంక్షేమ పథకాల అమలు, విద్యా మౌలిక వసతుల అభివృద్ధి, రానున్న శాసన తీర్మానాలు తదితర అంశాలు చర్చకు రానున్నాయి.

ప్రజా సంక్షేమం, సాగునీరు, విద్య, మౌలిక వసతులకు సంబంధించిన అంశాలపై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య జరిగే చర్చలు రెండో రోజు సమావేశాల్లో ప్రధానంగా నిలవనున్నాయి.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana