
పని పర్యటనలో గది తాళం మర్చిపోయి సానా బాత్‌లో నిద్రపోయారనే కారణంతో ఉద్యోగం కోల్పోయిన మాజీ టెక్ ఎగ్జిక్యూటివ్ షానన్ బర్న్స్‌కు బ్రిటన్ ఎంప్లాయ్మెంట్ ట్రిబ్యునల్‌లో కీలక విజయం లభించింది.
ఏడీహెచ్‌డీతో ఉన్న తనను దివ్యాంగురాలిగా పరిగణించకుండా అన్యాయంగా ఉద్యోగం నుంచి తొలగించారని ఆరోపిస్తూ షానన్ బర్న్స్ దాఖలు చేసిన కేసులో, భారీ పరిహారం కోరేందుకు ట్రిబ్యునల్ అనుమతించింది. ఆమె దాదాపు రూ.9,637 కోట్ల పరిహారాన్ని డిమాండ్ చేసే అవకాశం పొందారు.
అంతేకాకుండా, కంపెనీ తనపై విధించాలనుకున్న పరిహారానికి పరిమితి విధించాలన్న పిటిషన్‌ను కూడా ట్రిబ్యునల్ తిరస్కరించింది. ఈ నేపథ్యంలో షానన్ బర్న్స్ కేసు ఇప్పుడు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఏమిటి? ట్రిబ్యునల్ ఎలాంటి నిర్ణయం తీసుకుంది? కంపెనీ వాదనను ఎందుకు తిరస్కరించింది? ఇప్పుడు బర్న్స్‌కు ఎంత పరిహారం లభించే అవకాశం ఉంది? తెలుసుకుందాం.అంతర్జాతీయ టెక్ రంగంలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. అధికారిక పర్యటనలో భాగంగా మరో ప్రాంతానికి వెళ్లిన ఓ ఉద్యోగిని, అక్కడి సౌనా బాత్రూమ్లో నిద్రపోయిందన్న కారణంతో కంపెనీ ఉద్యోగం నుంచి తొలగించింది. దీంతో సదరు ఉద్యోగిని ఏకంగా రూ.9,637 కోట్ల భారీ నష్టపరిహారం కోరుతూ కోర్టును ఆశ్రయించింది.
ఈ ఘటన బ్రిటన్‌లో చోటుచేసుకుంది. అయితే, ఈ కేసులో ఉద్యోగికి సంబంధించిన కీలక అంశాలను బ్రిటన్ ఉపాధి ట్రిబ్యునల్ పరిగణనలోకి తీసుకుంది. ఆమెకు ఆటిజమ్, ADHD వంటి వైకల్యాలు ఉన్నాయని, వాటి నేపథ్యంలో జరిగిన పరిణామాలను కూడా పరిశీలించాల్సిన అవసరం ఉందని ట్రిబ్యునల్ పేర్కొంది.
తన వైకల్య పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండా ఉద్యోగం నుంచి తొలగించడం వివక్షకు దారితీసే అంశమని ఉద్యోగి వాదించింది. దీంతో ఈ కేసు ఇప్పుడు భారీ నష్టపరిహారం క్లెయిమ్‌తో పాటు దివ్యాంగుల హక్కులు, ఉద్యోగ ప్రదేశాల్లో సంస్థల బాధ్యతలపై చర్చకు దారితీస్తోంది.
అసలు ఆ ఉద్యోగిని ఎందుకు తొలగించారు? ఆమె కోరుతున్న రూ.9,637 కోట్ల పరిహారం వెనుక కారణమేంటి? ట్రిబ్యునల్ ఈ కేసులో ఏం చెప్పింది? ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
బాధితురాలు షానన్ బర్న్స్ గతంలో ప్రముఖ టెక్ సంస్థ ‘గిట్‌పాడ్’లో వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇంజినీరింగ్‌గా పనిచేశారు. ఆమెకు మొదటి నుంచే ADHD అనే మానసిక ఆరోగ్య పరిస్థితి ఉన్నట్లు పేర్కొనబడింది.
2023 ఏప్రిల్‌లో ఆస్ట్రియాలోని లోఫర్లో గిట్‌పాడ్ సంస్థ నిర్వహించిన టీమ్-బిల్డింగ్ కార్యక్రమానికి షానన్ అధికారికంగా హాజరయ్యారు. ఆ పర్యటనలో మద్యం సేవించిన అనంతరం ఆమె తన గది తాళంచెవిని మర్చిపోవడంతో హోటల్ గదిలోకి వెళ్లలేకపోయారు. రాత్రి సమయంలో ప్రత్యామ్నాయ వసతి లేకపోవడంతో చివరకు అదే హోటల్లోని సౌనా బాత్ గదిలో రాత్రి గడపాల్సి వచ్చింది.
