
DSports 07Mar 2026: ముంబై: వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన హై-ఓల్టేజ్ సెమీఫైనల్లో భారత్ మరోసారి తన బ్యాటింగ్ సత్తాను చాటింది. నిర్ణీత 20 ఓవర్లలో 253/7 భారీ స్కోరు సాధించినప్పటికీ, బౌలింగ్ విభాగంలో లోపాలు మరోసారి బయటపడటంతో మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠగా సాగింది. చివరకు ఇంగ్లాండ్‌పై 7 పరుగుల తేడాతో విజయం సాధించి భారత్ ఫైనల్‌కు దూసుకెళ్లింది.
- టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్ సంజూ శాంసన్ (42 బంతుల్లో 89) మెరుపు ఇన్నింగ్స్‌తో బలమైన పునాది వేశారు. ఇషాన్ కిషన్ (39), శివం దూబే (43) కూడా మెరుపులు మెరిపించడంతో భారత్ టీ20 ప్రపంచకప్ నాకౌట్ చరిత్రలోనే అత్యధిక స్కోరును నమోదు చేసింది. 19 సిక్సర్లు, 18 ఫోర్లతో వాంఖడే హోరెత్తిపోయింది.
- 254 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌ను భారత బౌలర్లు కట్టడి చేయడంలో విఫలమయ్యారు.ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో భారత స్పిన్నర్లు, పేసర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు.ఇంగ్లాండ్ యువ బ్యాటర్ జాకబ్ బెథెల్ (48 బంతుల్లో 105) సెంచరీతో భారత బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. ఒకానొక దశలో ఇంగ్లాండ్ విజయం సాధించేలా కనిపించింది. అయితే, చివరి ఓవర్లలో జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో భారత్ ఊపిరి పీల్చుకుంది. బుమ్రా 18వ ఓవర్లో కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చి ఇంగ్లాండ్ జోరుకు బ్రేక్ వేశారు.
- బ్యాటర్లు అద్భుతమైన ఫామ్‌లో ఉండి జట్టును పటిష్ఠ స్థితిలో నిలిపినప్పటికీ, బౌలర్ల వైఫల్యం టీమ్ మేనేజ్మెంట్ను కలవరపెడుతోంది. ముఖ్యంగా భారీ స్కోర్లు నమోదయ్యే మ్యాచ్‌ల్లో బౌలింగ్ విభాగం మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
