
D Educt: Nov 9: వరంగల్లోని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి మేనేజ్మెంట్ కోటాలో ఖాళీగా ఉన్న కేటగిరీ-సి ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీకి ప్రత్యేక స్ట్రే రౌండ్ కౌన్సెలింగ్ నిర్వహించనుంది.
రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ప్రైవేటు మెడికల్, డెంటల్ కళాశాలలతో పాటు అనురాగ్ విశ్వవిద్యాలయం పరిధిలోని నీలిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియకు అవకాశం కల్పించింది.
అర్హులైన అభ్యర్థులు నవంబరు 7వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి నవంబరు 9వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు నిర్ణీత గడువులోగా రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు.
