DSports 25 Nov:ముంబై:“స్మృతి తండ్రి గారి ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్ల, స్మృతి మరియు పలాశ్ ల వివాహాన్ని తాత్కాలికంగా నిలిపివేశాం. ఈ సున్నితమైన సమయంలో కుటుంబ గోప్యతను గౌరవించాల్సిందిగా అందరినీ కోరుతున్నాము” అని ఒక హృదయపూర్వక సందేశాన్ని పంపారు.

నవంబర్ 23న (ఆదివారం) మహారాష్ట్రలోని సాంగ్లీలో వీరి వివాహం జరగాల్సి ఉంది.ళ్లికి ముందు రోజు ఉదయం స్మృతి తండ్రి శ్రీనివాస్ మంధాన అస్వస్థతకు గురవడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.ఈ వైద్య అత్యవసర పరిస్థితి (Medical Emergency) కారణంగా, తండ్రి పూర్తిగా కోలుకునే వరకు వివాహాన్ని నిరవధికంగా వాయిదా వేయాలని స్మృతి మంధానా దృఢంగా నిర్ణయించుకున్నట్లు ఆమె మేనేజర్ కూడా ధృవీకరించారు.

సోషల్ మీడియా నుండి తొలగింపు: ఈ ప్రకటన తర్వాత, స్మృతి మంధాన తన సోషల్ మీడియా ఖాతాల నుండి నిశ్చితార్థం, ప్రీ-వెడ్డింగ్ వేడుకలకు సంబంధించిన అన్ని పోస్టులను తొలగించడం, అభిమానులలో ఆందోళన పెంచింది.

ప్రస్తుతం, ఇరు కుటుంబాలు శ్రీనివాస్ మంధాన ఆరోగ్యంపై దృష్టి సారించాయి. తదుపరి వివాహ తేదీని త్వరలో తెలియజేస్తామని కుటుంబ వర్గాలు తెలిపాయి.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana