
D Educt: Aug 12: యువతకు నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలను మరింత మెరుగుపరిచే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలోని తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్)తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఉద్యోగ పోర్టల్ ఫౌండిట్ వెల్లడించింది. ఈ భాగస్వామ్యంతో విద్యార్థులు, ఉద్యోగార్థులు మారుతున్న పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా తమ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకునే అవకాశం కలుగుతుందని టాస్క్ సీఈఓ కె. నితిన్‌కుమార్‌రెడ్డి తెలిపారు.
టాస్క్‌లో నమోదైన అభ్యర్థులకు ఫౌండిట్ తక్కువ ఫీజులతో పలు సేవలను అందించనుంది. ముఖ్యంగా ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు రెజ్యూమె తయారీ, ఏఐ (కృత్రిమ మేధ) ఆధారిత ఇంటర్వ్యూలకు శిక్షణ, పరిశ్రమ నిపుణులతో నమూనా ఇంటర్వ్యూల వంటి సేవలను అందించనున్నారు.
ఈ సహకారంతో యువతకు ఉద్యోగ మార్కెట్లో అవసరమైన నైపుణ్యాలపై అవగాహన పెరగడంతో పాటు, ఇంటర్వ్యూలను సమర్థంగా ఎదుర్కొనే సామర్థ్యం మెరుగుపడుతుందని అధికారులు భావిస్తున్నారు.
