
DET:DEC 17:
ఇది నిజంగా బయోపిక్ సినిమానా?
అమరన్ సినిమాలో మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించి శివకార్తికేయన్ మెప్పించారు. ఇప్పుడు పరాశక్తి కూడా ఒక బయోపిక్ అని వార్తలు వినిపిస్తున్నాయి.ఈ సినిమా 1965లో తమిళనాడులో జరిగిన ‘హిందీ వ్యతిరేక ఉద్యమం నేపథ్యంలో సాగుతుందని తెలుస్తోంది.ఒక సామాన్య విద్యార్థి వ్యవస్థపై ఎలా పోరాడాడు అనే అంశాన్ని ఇందులో చూపించబోతున్నారట.
ప్రమోషనల్ వీడియోలో ఈస్టర్ ఎగ్స్:
ఇటీవల విడుదలైన ప్రమోషనల్ వీడియోలు మరియు పాటల్లో నెటిజన్లు కొన్ని క్లూస్ని గమనించారు.ముఖ్యంగా పీరియాడికల్ సెటప్,అప్పటి కాలం నాటి దుస్తులు,మరియు బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్న కొన్ని పోస్టర్లు ఈ కథ 1960ల నాటిదని స్పష్టం చేస్తున్నాయి.ఒక పోస్టర్లో కాలేజీ విద్యార్థుల నిరసనలకు సంబంధించిన గుర్తులు ఉండటం,ఇది ఒక యదార్థ గాథ ఆధారంగా రూపొందుతున్న బయోపిక్ అనే అనుమానాలకు బలం చేకూరుస్తోంది.
శ్రీలీల రోల్ మరియు కొత్త అప్డేట్స్:
ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తుండగా,ఆమె పాత్ర కూడా చాలా బలంగా ఉంటుందని సమాచారం.ఇటీవల విడుదలైన సింగారాల సీతాకోకవే పాటలో శివకార్తికేయన్ – శ్రీలీల జోడీ రెట్రో లుక్లో కనిపించి అందరినీ ఆకట్టుకుంది.ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.
విడుదల ఎప్పుడు?
ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది.2026 సంక్రాంతి కానుకగా జనవరి 14న పరాశక్తి థియేటర్లలోకి రానుంది.ఒక చారిత్రక పోరాటాన్ని సుధా కొంగర తనదైన శైలిలో ఎలా ఆవిష్కరిస్తారో చూడాలి.
