
హైదరాబాద్‌లో SIR ఫారమ్‌ల సమర్పణకు నేడే తుది గడువు. ఎలక్షన్ కమిషన్ గడువును పొడిగించినప్పటికీ.. డిజిటలైజేషన్ ప్రక్రియ ఇంకా 60 శాతం కూడా పూర్తి కాలేదు. గత ఏడు రోజుల్లో నమోదైన ఫారమ్‌ల సంఖ్య కేవలం 4 శాతం మాత్రమే పెరిగింది.
సెలవు రోజుల్లోనూ BLOలు ఇంటింటికీ వెళ్లి ఫారమ్‌లను సేకరిస్తున్నప్పటికీ.. నగరవాసులు గ్రామీణ ప్రాంతాల్లోని ఓట్ల నమోదుకే ఎక్కువగా ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో మొత్తం 48 లక్షల మందికి SIR ఫారమ్‌లు అందాల్సి ఉండగా.. ఇప్పటివరకు దాదాపు 28 లక్షల మంది మాత్రమే నమోదు చేసుకున్నారు.
తమకు అందుతున్న ప్రతి ఫారమ్‌ను అధికారులు మరోసారి పరిశీలించి, వివరాలను రీ-వెరిఫై చేసిన అనంతరం డిజిటలైజేషన్ చేస్తున్నట్లు AERO అధికారులు వెల్లడించారు. తుది గడువు నాటికి మరిన్ని ఫారమ్‌లు అందే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
