DSports 05Feb 2026:న్యూఢిల్లీ: తెలంగాణ స్టార్ షూటర్ ఇషా సింగ్ అంతర్జాతీయ వేదికపై మరోసారి భారత్ జెండాను ఎగురవేసింది. ఆసియా షూటింగ్ చాంపియన్‌షిప్‌ తొలి రోజే ఆమె రెండు బంగారు పతకాలు కొల్లగొట్టింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో అటు వ్యక్తిగతంగా, ఇటు టీమ్ ఈవెంట్‌లోనూ ఆమె అగ్రస్థానంలో నిలిచి పసిడి పతకాలను ముద్దాడింది.

  • వ్యక్తిగత విభాగం: మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్‌లో ఇషా సింగ్ 239.8 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. చైనీస్ తైపీకి చెందిన చెంగ్ యెన్ చింగ్ (235.4) రజతం సాధించగా, మరో తైపీ షూటర్ యు ఐ-వెన్ (217.7) కాంస్యంతో సరిపెట్టుకున్నారు. ఇషాకి ఇది రెండో సీనియర్ ఆసియా చాంపియన్‌షిప్ వ్యక్తిగత స్వర్ణం.
  • టీమ్ ఈవెంట్: ఇషా సింగ్ తన సహచర షూటర్లు మను భాకర్, సురుచి సింగ్లతో కలిసి టీమ్ ఈవెంట్‌లోనూ సత్తా చాటింది. ఈ ముగ్గురూ కలిసి మొత్తం 1726 పాయింట్లు సాధించి భారత్‌కు స్వర్ణ పతకాన్ని అందించారు. వియత్నాం (1713) రజతం, చైనీస్ తైపీ (1711) కాంస్యం గెలుచుకున్నాయి.
  • ఫైనల్ మ్యాచ్ ఆరంభంలో ఇషా సింగ్ కాస్త తడబడింది. మొదటి 5 షాట్ల తర్వాత ఆమె 7వ స్థానంలో నిలిచింది. అయితే, తన అనుభవాన్నంతా రంగరించి, ఏకాగ్రతతో పుంజుకున్న ఇషా.. చివరి షాట్ వరకు నిలకడగా రాణించి విజేతగా నిలిచింది. “ప్రారంభం కొంచెం కష్టంగా అనిపించినా, నా ప్రాసెస్ మీద నాకు నమ్మకం ఉంది. చివరి షాట్ వరకు ఆట ముగియదని నాకు తెలుసు. హోమ్ గ్రౌండ్‌లో పతకాలు సాధించడం చాలా సంతోషంగా ఉంది.”
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana