
DNews: Dec 05: భువనగిరి జిల్లా కలెక్టర్ ఎం. హనుమంతరావు గ్రామాల అభివృద్ధి కోసం సేవా భావం కలిగిన, గ్రామాలను అభివృద్ధి చేయగల సామర్థ్యం ఉన్న వ్యక్తులను సర్పంచ్‌లు, వార్డు సభ్యులుగా ప్రజలు ఎన్నుకోవాలని సూచించారు. ఆయన బొమ్మల రామారం మండల కేంద్రంలో ఓటు హక్కుల వినియోగంపై SWEEP ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో ర్యాలీ నిర్వహించబడింది. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని, ఎటువంటి ప్రలోభాలకు లోనుకాకుండా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. మహిళలందరితో ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఓ నాగి రెడ్డి మరియు ఇతరులు పాల్గొన్నారు.
