
DNews: Mar 02: నల్గొండ మండలంలోని చందనపల్లి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక ప్రైవేట్ స్కూల్ బస్సు ఢీకొనడంతో ఇద్దరు మరిది బావలు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు వంశీ (30) మరియు రమేష్ (30)గా గుర్తించారు. వీరు వరుసగా నర్కటపల్లి మండలంలోని నక్కలపల్లి గ్రామం మరియు శాలి గౌరారం మండలంలోని ఊట్కూర్ గ్రామానికి చెందినవారు. నల్గొండ నుండి నకిరేకల్ వైపు బైక్‌పై ప్రయాణిస్తుండగా చందనపల్లి వద్ద స్కూల్ బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మృతదేహాలపై పోస్ట్‌మార్టం నిర్వహించారు. ఈ ఘటనపై నల్గొండ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
