DSports 24Jan 2026: భారత టెస్టు జట్టులోకి పునరాగమనం కోసం వేచి చూస్తున్న సర్ఫరాజ్ ఖాన్ (227) తన బ్యాట్‌తో మరోసారి గట్టి సమాధానం ఇచ్చారు. కేవలం 219 బంతుల్లో 19 ఫోర్లు, 9 భారీ సిక్సర్లతో విధ్వంసకర డబుల్ సెంచరీ సాధించారు. సర్ఫరాజ్ తన ద్విశతకాన్ని కేవలం 206 బంతుల్లోనే పూర్తి చేయడం విశేషం.

  • సర్ఫరాజ్ ఖాన్ డబుల్ సెంచరీకి తోడు, కెప్టెన్ సిద్ధేష్ లాడ్ (104) శతకంతోను, సువేద్ పార్కర్ (75) అర్ధ శతకంతోను రాణించడంతో ముంబై తన తొలి ఇన్నింగ్స్‌లో 560 పరుగులకు ఆలౌటైంది.
  • టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ బౌలింగ్‌లోనూ సర్ఫరాజ్ వెనక్కి తగ్గలేదు. సిరాజ్ వేసిన 39 బంతుల్లోనే 45 పరుగులు పిండుకున్నారంటే ఆయన జోరు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
  • భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ జట్టు రెండో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. ఓపెనర్లు విఫలమైనా, రాహుల్ సింగ్ (82 నాటౌట్), హిమతేజ (40 నాటౌట్) క్రీజులో ఉండి జట్టును ఆదుకుంటున్నారు.
  • హైదరాబాద్ బౌలర్లలో రక్షణ్ రెడ్డి 4 వికెట్లతో మెరవగా, రోహిత్ రాయుడు 2 వికెట్లు తీశారు.
పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana