
DNews: Jan 06: సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నగరంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనున్నది. రాంగారెడ్డి రీజినల్ మేనేజర్ శ్రీలత మాట్లాడుతూ, ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లపై పోలీసు, ట్రాఫిక్ అధికారులతో మహాత్మా గాంధీ బస్ స్టాండ్‌లో సమావేశం నిర్వహించామని తెలిపారు.
రాయలసీమ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం ప్రత్యేక బస్సులను ఆరంఘర్ నుండి నడపనున్నారు. అలాగే ఎల్బీ నగర్ నుండి విజయవాడ, నల్గొండ, ఖమ్మం ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు జేబీఎస్ అధికారులు వెల్లడించారు.
ఈ సమావేశంలో సౌత్ జోన్, సుల్తాన్ బజార్, రాజేంద్రనగర్ ఏసీపీలు కె. లక్ష్మణ్, కె. శ్రీనివాస్, డి. సుధీర్ రెడ్డి, ఆర్టీసీ అధికారులు మహాంకాళి, ఎన్. జనకిరామ్, ట్రాఫిక్ సీఐలు వి. మదన్‌లాల్, జి. బాలకృష్ణతో పాటు అనేక మంది అధికారులు పాల్గొన్నారు.
ఈ ప్రత్యేక బస్సుల ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జిల్లాలకు వెళ్లే ప్రయాణికులకు సౌకర్యం కల్పించడమే లక్ష్యంగా ఆర్టీసీ చర్యలు చేపట్టింది.
